అమరావతి ; జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నాడు- నేడు సాఫ్ట్ వేర్ ను తెలంగాణా రాష్ట్రం వినియోగించు కునేందుకు అనుమతిస్తూ జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మన బడి, నాడు- నేడు సాఫ్ట్ వేర్ ను తెలంగాణా లోని పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పన కోసం వినియోగించే కునేందుకు అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నాడు నేడు సాఫ్ట్ వేర్ ను వినియోగించింది ఏపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో.. ఆంధ్ర ప్రదేశ్ తరహాలోనే… తెలంగాణ రాష్ట్రంలోనూ నాడు- నేడు నిర్వహించాలని కేసీఆర్ సర్కార్ ఇటీవలే నిర్ణయం తీసుకుంది. దీంతో ఏపీ ప్రభుత్వాన్ని సాఫ్ట్ వేర్ ఇవ్వాలంటూ గతంలోనూ కేసీఆర్ సర్కార్ కోరింది. తెలంగాణ ప్రభుత్వం అడిగిన మేరకు ఏపీ సర్కార్ సానుకూలంగా స్పందించింది. ఈ నేపథ్యంలోనే టీసీఎస్ రూపకల్పన చేసిన ఈ సాఫ్ట్ వేర్ ను తెలంగాణాకు ఇచ్చేందుకు నిరభ్యంతర పత్రం జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ పాఠశాల విద్యాశాఖ.