ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు.. ప్రభుత్వం అప్రమత్తం

-

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని హోంమంత్రి తానేటి అనిత తక్షణమే స్పందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌తో ఫోన్‌లో మాట్లాడి తాజా పరిస్థితులపై సమాచారం పొందారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తం చేస్తూ, ప్ర‌జ‌లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేసి, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.

అలాగే, సహాయక చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని హోంమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆమె అధికారులను ఆదేశించారు. తాగునీరు, విద్యుత్ వంటి అవసరమైన సేవల సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news