ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా అయినా రాజధానిని విశాఖ కు తరలించాలని యోచనలో ఉంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించి కోర్టులో కేసులు నడుస్తున్నాయి సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగాకృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ (KRMB) కార్యాలయాన్ని వైజాగులో ఏర్పాటు చెయ్యాలని ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. నిజానికి విజయవాడలో ఆఫీస్ పెట్టాలని గతంలో ప్రధాన కార్యదర్శి, ఇరిగేషన్ కార్యదర్శి లేఖలు రాశారు.
కానీ ఇప్పుడు ఆఫీస్ విశాఖలో పెట్టాలని లెటర్ రాయడం సంచలనంగా మారింది. విజయవాడ బదులు వైజాగులో కృష్ణా రివర్ బోర్డ్ కార్యాలయం ఏర్పాటు చేయాలని తాజాగా ప్రతిపాదనలు పంపడం మీద వ్యతిరేకత కూడా మొదలయింది. కృష్ణా బేసిన్ కు సంబంధం లేని వైజాగులో కార్యాలయం పెట్టాలనే ప్రతిపాదనపై సాగు నీటి వినియోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ప్రభుత్వం మరే నిర్ణయం తీసుకుంటుందో.