రాజధాని ప్రకటను ముందు అమరావతిలో కొంతమంది అసైన్డ్ భూములు కొనుగోలు చేశారు.. తర్వాత ఆ భూముల్ని ల్యాండ్ పూలింగ్‌లో ప్రభుత్వానికి ఇవ్వగా.. వారికి ప్లాట్లు కేటాయించారు. అయితే తాజాగా ప్రభుత్వం మరో కీలక జీవోను జారీ చేసింది. అమరావతిలో అసైన్డ్ ల్యాండ్స్ కొనుగోలుదారులకు ప్రభుత్వం షాకిచ్చింది.. ల్యాండ్ పూలింగ్ ప్రయోజనాలు వారికి వర్తించదంటోంది. గతంలో వారికి కేటాయించిన ప్లాట్లు రద్దు చేసింది.. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.. అసైన్డ్ ల్యాండ్స్ కొనుగోలు చేయడం చెల్లదని సర్కార్ తెలిపింది.
అయితే అసైన్డ్ భూములు కొనుగోలు చేయడం యాక్ట్‌కు విరుద్ధమని.. భూ యాజమాన్య హక్కు కొంత వరకే ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. భూముల్ని కొనుగోలు చేసి పూలింగ్‌కు ఇచ్చినవారు కాకుండా అసలైన అర్హులకు ప్లాట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, మరోవైపు మూడు రాజధానులు ఉండొచ్చంటూ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో హీట్ పెంచాయి. సీఎం ప్రకటనతో అమరావతి రైతులు ఆందోళనలకు దిగారు.. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తున్నారు. 29 గ్రామాల్లో బంద్ పాటిస్తున్నారు.. రోడ్లపై బైఠాయించి నిరసనలు తెలియజేస్తున్నారు.