తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది… 10 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేశారు. ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతిలో ఐదవ తరగతి చదువుతున్న 10 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేశాడట ఓ దుర్మార్గుడు. తిరుపతిలో ఉన్న రాజీవ్ నగర్ కు చెందిన రమణ చారి అనే వ్యక్తి డబ్బులు ఇస్తానని మభ్యపెట్టి బాలికతో అసభ్య ప్రవర్తన చేసినట్లు చెబుతున్నారు.

ఈ తరుణంలోనే.. లైంగిక దాడి కూడా జరిగిందని అంటున్నారు. అయితే… బాలిక చాక చక్యంతో నిందితుడి వద్ద నుంచి తప్పించుకొని తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపిందని అంటున్నారు. ఈ తరుణంలోనే.. బాలిక తల్లిదండ్రులు అలిపిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. దీంతో నిందితుడుపై ఫొక్సో కేసు నమోదు చేసిన అలిపిరి పోలీసులు… రాజీవ్ నగర్ కు చెందిన రమణ చారి కోసం గాలిస్తున్నారు.