కరోనా రోగులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా అనుమానితులు, నిర్ధారణ అయిన వారి చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చింది. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ కేఎస్. జవహార్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా చికిత్సకు రోజుకు 3250 రూపాయలు.వెంటిలేటర్, ఎన్ఐవి లేకుండా ఐసియూలో చికిత్స పొందితే రోజుకు 5480 రూపాయలు.
ఎన్ఐవి ఉండి ఐసియూలో చికిత్స పొందుతే రోజుకి 5980 రూపాయలు. వెంటిలేటర్ ఉండి ఐసియూలో చికిత్స పొందుతుంటే రోజుకి 9580 రూపాయలు. వెంటిలేటర్ ఉండి సెప్టిక్ షాక్ చికిత్స చేస్తే రోజుకు 10380 రూపాయలుగా నిర్ణయించారు. ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ పరిధిలోని ఆస్పత్రులన్నీ ఇవే ఫీజులను వసూలు చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.