ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుని ఇండస్ట్రీయల్ ప్రమోషన్ ఆఫీసర్లుగా గ్రామ, వార్డు ఇంజనీర్ అసిస్టెంట్లని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. డైరక్టరాఫ్ ఇండస్ట్రీస్ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ సర్కార్ ఇండస్ట్రీయల్ ప్రమోషన్ ఆఫీసర్ల కొరత ఉండడంతో గ్రామ ఇంజనీరింగ్ అసిస్టెంట్ల సేనలను వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకుంది. సాంకేతిక అర్హతలున్న గ్రామ సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ల సేవల వినియోగానికి పరిశ్రమల శాఖకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దీంతో ఇక మీద ఇంజనీరింగ్ అసిస్టెంట్లు క్షేత్ర స్థాయిలో పారిశ్రామిక సర్వేలు చేయనున్నారు. ఎప్పటికప్పుడు సమగ్ర పారిశ్రామిక సర్వేలు చేపట్టేలా సూచనలు కూడా చేసింది ఏపీ ప్రభుత్వం. పరిశ్రమల స్థాపన విషయంలో అనువైన ప్రాంతాలను గుర్తించే విషయంలో ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించేలా ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు బాధ్యతలని అప్పగించింది. పారిశ్రామిక అవసరాలు తీర్చేలా నిరుద్యోగ యువతను గుర్తించి, శిక్షణ ఇప్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.