8 లక్షలకు పైగా పెన్షన్ల వేరిఫికేషన్ ను ప్రారంభించిన ఏపీ..!

-

ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 8 లక్షల 18 వేల పెన్షన్లకు సంబంధించి వేరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించింది ప్రభుత్వం. దివ్యంగుల పెన్షన్ అలాగే వివిధ వ్యాధులకు సంబంధించి ఇబ్బంది పడుతున్న వారి పెన్షన్ ను తనిఖీలు చేయనున్నారు అధికారులు. కిడ్నీ, హార్ట్ ప్రాబ్లెమ్, తలసేమియా ఇలా వివిధ కేటగిరీలుగా పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. అయితే నకిలీ సర్టిఫికెట్ లతో పెన్షన్ తీసుకునే వారిని గుర్తించే పనిలో పడింది ప్రభుత్వం.

దాంతో మూడు నెలల పాటు ఈ తనిఖీ ప్రక్రియ కొనసాగనుంది. జిల్లా స్థాయి అధికారులు.. మెడికల్ టీం.. ఒక డిజిటల్ అసిస్టెంట్ సహాయంతో పెన్షన్ తనిఖీలు చేయనున్నారు. తనిఖీలు పూర్తయిన తర్వాత ఒక వేళ నకిలీ సర్టిఫికెట్ గుర్తిస్తే ముందుగా పెన్షనర్లకు నోటీసులు ఇస్తారు. ఆ తర్వాత పెన్షన్ తొలగింపు పై నిర్ణయం తీసుకుంటారు. తనిఖీ చేసిన డేటా మూడు నెలల తర్వాత ప్రకటించాలా లేక ప్రతి 15 రోజులకు ప్రకటించి నిర్ణయం తీసుకోవాలా అనే అంశంపై చర్చిస్తుంది ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news