కామారెడ్డిలో ఫేక్ డాక్టర్ కలకలం..!

-

కామారెడ్డిలో స్టార్ హాస్పిటల్ లో ఫేక్ డాక్టర్ కలకలం ఇప్పుడు పెద్ద చర్చాగా మారింది. మూడేళ్లు గా ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాలోని వివిధ ఆసుపత్రిలో డాక్టర్ గా చెలామణి అవుతున్న.. మందమర్రి మండలం రామకృష్ణ పూర్ కు చెందిన ముల్కల రవీందర్.. డాక్టర్ రవీందర్ రెడ్డి పేరుతో అందరిని మోసం చేస్తున్నాడు. డిగ్రీ కూడా చదవని రవీందర్, గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసినట్లు ఫేక్ సర్టిఫికెట్స్ పుట్టించాడు.

ఆ తర్వాత డాక్టర్ రవీందర్ రెడ్డి పేరుతో సర్టిఫికెట్స్ సృష్టించిన రవీందర్.. ఖానాపూర్ షణ్ముఖ ఆసుపత్రిలో పిల్లల డాక్టర్ గా 2 లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు ఈ ఫేక్ డాక్టర్. అయితే తాజాగా ఫేక్ సర్టిఫికెట్స్ తో డాక్టరుగా చలామణి అవుతున్న రవీందర్ ను అదుపులో తీసుకున్నారు కామారెడ్డి పోలీసులు. అతని వద్ద నుండి ఫేక్ ఆధార్ కార్డు, సర్టిఫికెట్స్ ఓ సెల్ ఫోన్, ల్యాప్ ట్యాప్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించాడు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news