కవిత కమిషన్ కోసమే లిక్కర్ బిజినెస్ చేసింది : ఎంపీ కిరణ్

-

కేటీఆర్.. నువ్వు కేసీఆర్ సైనికుడివి కాదు.. యువరాజువి. పదేళ్ల క్రితం మీ నాయన తెలంగాణ నినాదం తో వచ్చి తెలంగాణ నీ దోచుకున్నాడు. ఇప్పుడు నువ్వు అదే నినాదం ఎత్తుకోవాలని చూస్తున్నావు అని ఎంపీ చామల కిరణ్ అన్నారు. అయితే ఇక్కడ నీ డైలాగులు చెల్లవు. కాపలా కుక్క లెక్క ఉంటాం అని దోచుకున్నారు. ఏడాది పాలన లో మీద అవినీతి ముద్ర వేయాలని చూస్తున్నారు. 7 లక్షల కోట్లు అప్పు చేసి కాంట్రాక్టర్లుకు దోచి పెట్టావు. వాళ్లంతా మీ బినామీ లే కదా అని ప్రశ్నించారు. అలాగే మేము బామ్మర్దికి కూడా పనులు ఇవ్వలేదు అంటున్నావు. మీ సొంత చెల్లి కమిషన్ కోసమే.. కదా లిక్కర్ బిజినెస్ చేసింది అని ప్రశ్నించారు.

ఇక కేటీఆర్ కి ఏ కోర్టు లో ఊరట రావటం లేదంటే.. తప్పు చేసినట్లు తేలుతుంది అని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఇప్పటికైనా కేటీఆర్ విచారణకు పూర్తిగా సహకరించాలి. ఆర్బీఐ నిబంధనలు తుంగలో తొక్కి 55 కోట్లు ఎలా దారి మళ్లించారు. గ్రీన్ కో కంపనీ ద్వారా ఎలెక్ట్రోల్ బాండ్ల పొందారు అంటే.. క్విడ్ ప్రో కో స్పష్టం అవుతుంది. ఎన్ని ప్రలోభాలు రేవంత్ రెడ్డిని పెట్టిన చట్టపరంగా ఎదుర్కున్నారు తప్ప.. మిలా వ్యవహరించలేదు. సిరిసిల్ల లో కేటీఆర్ అండతో భూ అక్రమాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నీ విమర్శిస్తే.. చూస్తూ ఊరుకోం. చేసిన తప్పులకు మూల్యం చెల్లించక తప్పదు అని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news