ఏపీ మంత్రికి అనారోగ్యం.. కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కొనుగోలు !

-

ఏపీ ప్రభుత్వం కొత్త బుల్లెట్ ప్రూఫ్‌ వాహనాల కొనుగోళ్లు చేయడానికి సిద్దం అయింది. పది బుల్లెట్ ప్రూఫ్‌ వాహనాల కొనుగోళ్లకు పరిపాలనా అనుమతులిచ్చింది ఏపీ ప్రభుత్వం. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కొనుగోళ్లకు రూ. 6.75 కోట్లు కేటాయించింది. రూ. 65 లక్షల విలువైన స్కార్పియోలు – ఐదు, రూ. 70 లక్షల విలువైన టాటా హెక్సాలు మరో ఐదు కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. సీఎం, మంత్రులు, పోలీసు ఉన్నతాధికారుల భద్రత కోసం ఈ కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వినియోగించనున్నారు.

ప్రస్తుతం ఉన్న బుల్లెట్ ప్రూఫ్‌ వెహికల్స్‌తో రకరకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రభుత్వానికి పలువురు మంత్రులు  ఫిర్యాదులు చేసినట్టు చెబుతున్నారు. ఓ మంత్రి అనారోగ్యానికి ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనం కారణమైనట్టు చెబుతున్నారు. మంత్రుల సూచనలు, పోలీసు ఉన్నతాధికారుల సలహాలతో కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కొనుగోళ్లకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version