సీఎం కేసీఆర్ పీఆర్వో విజయ్ తొలగింపు వెనుక అసలు కథ ఇదేనా

-

తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయాలు ఒక్కోసారి ఆశ్చకరంగా సంచలనంగాను ఉంటాయి. తనకు నచ్చితే కీర్తికిరిటాలు ప్రసాదించే ఆయనే నచ్చకపోతే పాతాళానికి తోసేస్తాడు. కొంత కాలంగా స్తబ్దుగా ఉన్నా కేసీఆర్ పరిపాలన వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు నడుంబిగించారు. ముందుగా తన కోటరి పైనే దృష్టి పెట్టి సీఎంవోలో కీలకంగా వ్యవహరిస్తున్న పీఆర్వో గటిక విజయ్ కుమార్ పై వేటు వేశారు. పీఆర్వో విజయ్ ఉన్నపళంగా ఎందుకు తొలగించారు అన్నదాని పై ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ పీఆర్వో గటిక విజయకుమార్ పార్టీ నాయకులను కూడా లెక్క చేయకుండా.. తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. అతని వ్యవహార శైలి, అతని పై కొందరు టీఆర్ఎస్ నాయకులు ఏకంగా ముఖ్యమంత్రి కే ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. అయినా వీటిని పెద్దగా పట్టించుకోని కేసీఆర్ విజయ్ పై ఓ కన్నేసి ఉంచినట్లు తెలుస్తుంది. విజయకుమార్ పై తన దృష్టికి వచ్చిన ఆరోపణల విషయంలో విచారణ అనంతరమే ముఖ్యమంత్రి కేసీఆర్ తొలగింపునకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సీఎం కేసీఆర్ ఓ దశ వరకు నాయకులకు తన చుట్టూ ఉండే సన్నిహితులకు కొంత మేర స్వేచ్చ ఇస్తాడు. కానీ అదికమించి ప్రవర్తిస్తే మాత్రం అంతే కటువుగా ప్రవర్తిస్తాడు. విజయ్ ఎక్కడ తప్పు చేశాడనేది పక్కన పెడితే అంతటి కీలకపోస్టు పై బ్యూరోక్రాట్ల నుంచి పొలిటిషియన్ల వరకు ఓ కన్నేసి తన వ్యవహార ధోరణి పై సీఎం కి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తారు. ఓ జర్నలిస్ట్ గా పని చేసిన విజయ్ ఇలాంటి సున్నితమైన అంశాలను ఎందుకు తెలుసుకోలేకపోయాడో తెలీదు. ఇక కేసీఆర్ అంటే పడని పొలిటికల్ ప్రత్యర్ది క్యాంపులతో సంబంధాలు నెరుపుతూ ఇంటి గుట్టు బయటపెడితే లైట్ తీసుకునేంత సున్నిత మనస్కుడు కాదు కేసీఆర్.

దీనిపై కొన్నాళ్లుగా హెచ్చరిస్తున్నా విజయ్ తన ధోరణి మార్చుకోక పోవడంతో తగిన మూల్యం చెల్లించుకున్నాడు. పీఆర్వో అయిన తర్వాత ఆయన సంపాదించిన ఆస్తులపై ఇంటిలిజెన్స్ నుంచి కూడా ఓ నివేదిక తన వద్ద పెట్టుకున్నాడు కేసీఆర్. పేరుకి దీన్ని ఆధారంగా చేసుకొని వెంటనే పిఆర్ ఓ గా తొలగించవలసిందిగా సంబంధిత శాఖ అధికారులను సీఎం ఆదేశించ‌డం జరిగింది. అదే విధంగా విజ‌య్ కుమార్‌ను విద్యుత్ శాఖ లో ఉన్న జనరల్ మేనేజర్ పదవి నుంచి తొలగించడం జరిగింది. విజయ్ కుమార్ తొలగింపులో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సంఘటనతో అవినీతికి పాల్పడినా.. క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించినా వేటు తప్పదంటూ కేసీఆర్ అటు నాయకులకు, ఇటు అధికారులకు పరోక్షంగా హెచ్చరించి సంకేతాలిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version