వినాయక చవితి ఉత్సవాలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వారం రోజులుగా… వినాయక చవితి ఉత్సవాల పై గందరగోళ పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో వినాయక ఉత్సవాలపై…. ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాలకు గ్రీన్సిగ్నల్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది హైకోర్టు.

highcourt

ప్రైవేట్ స్థలాల్లో గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది ఏపీ హైకోర్టు. అలాగే కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ పూజలు చేసుకోవాలని హైకోర్టు సూచనలు చేసింది. ఒకేసారి ఐదుగురు ఉంచకుండా పూజలు చేసుకోవాలని కోర్టు సూచనలు చేసింది. మతపరమైన కార్యక్రమాలు నిరోధించే హక్కు ఎవరికీ లేదన్నారు ఏపీ హైకోర్టు… ఎట్టకేలకు వినాయక చవితి ఉత్సవాలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కాగా ఏపీ ఈ ఉత్సవాలను నిర్వహించేది లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసనలు చేసింది. వినాయక ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version