Breaking : వారిపై ట్రాఫిక్‌ పోలీసుల ప్రత్యేక నిఘా

-

నిబంధనలకు విరుద్ధంగా హారన్ మోగిస్తున్న వాహనాలను అడ్డుకునేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మే 4వ తేదీ గురువారం చంచల్ గూడ చౌరస్తాలో మీర్ చౌక్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా వాహన తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాల హారన్లను తొలగించారు. 2017 మరియు 2018 సంవత్సరాల్లో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఉల్లంఘన కేసుల సంఖ్య బాగా పెరిగింది, ఎందుకంటే చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేదు , డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సెల్‌ఫోన్‌లో మాట్లాడటం మరియు మద్యం సేవించి వాహనం నడపడం వంటి అనేక మందిపై కేసులు నమోదు చేయబడ్డాయి.

దీని కారణంగా, ట్రాఫిక్‌ను మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం వివిధ ఉల్లంఘనలకు జరిమానా మొత్తాలను పెంచవలసి వచ్చింది.తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు కూడా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టారు. అలాగే పెండింగ్ చలాన్లు ఉన్న వాహనాలపై దృష్టి పెట్టారు ట్రాఫిక్ పోలీసులు. ఈ క్రమంలో దేవరకొండ నుంచి బీఆర్ఎస్ సభకు తరలి వెళుతున్న జీపులను పోలీసులు తనిఖీ చేయగా..పలు వాహనాలపై పెండింగ్ చాలన్లు ఉన్నాయి. దీంతో చాలన్లు కట్టించుకొని పంపించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version