ఏపీ ప్రభుత్వ పాఠశాలలలో చేరాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్ !

-

రేపట్నుంచి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ సంధర్భంగా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన మౌలిక వసతులను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పరిశీలించారు. రేపట్నుంచి రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలు తెరచుకోబోతున్నాయన్న అయన కరోనా వ్యాప్తి చెంద కుండా నివారణకు తీసుకోవాల్సిన చర్యలు పరిశీలించామని అన్నారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా అన్ని తల్లిదండ్రులు ఆందోళన చెందకుండా చర్యలు తీసుకుంటున్నామని. అందుకే నవంబర్ 23 న రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభిస్తామని అన్నారు.

డిసెంబర్ 14న ప్రాథమిక పాఠశాలలు ప్రారంభిస్తామన్న ఆయన కరోనా వ్యాప్తి చెందకుండా ప్రతి పిల్లాడికీ ౩మాస్కులు అందించామని అన్నారు. తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, విద్యార్థులు ఎవరికీ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం ఎక్కడా రాజీ పడకుండా సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. పనిదినాలు పెంచి, సిలబస్ తగ్గించి చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. ప్రైవేటు పాఠశాల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేందుకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నామన్న ఆయన ప్రైవేటు పాఠశాలల నుంచి వచ్చే విద్యార్థులకు టీసీలు లేకుండానే ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుకునేలా ఆదేశాలు ఇచ్చామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version