Breaking : ఏపీ ఇంటర్‌ షెడ్యూల్‌ విడుదల

-

ఏపీ ఇంటర్‌ ప్రవేశాల షెడ్యూల్‌ను బోర్డు విడుదల చేసింది. ఇటీవల పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ఇంటర్మీడియట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన విధివిధానాలు బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ ప్రకటించింది. జులై 1 నుంచి ఇంటర్‌ ఫస్ట్‌, సెకండియర్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌, కోఆపరేటివ్‌, రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్‌, ట్రైబల్ వెల్ఫేర్‌, మోడల్‌ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ కోర్సుల్లో ప్రవేశాల షెడ్యూల్‌ను బోర్డు విడుదల చేసింది. రెండేళ్ల సాధారణ ఇంటర్మీడియట్‌తో పాటు ఒకేషనల్‌ కోర్సుల్లో విద్యార్ధులకు ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ నెల 19వ తేదీ సోమవారం నుంచి ఇంటర్మీయట్ మొదటి విడత అడ్మిషన్లకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జులై 20వ తేదీ వరకు దరఖాస్తుల్ని స్వీకరిస్తారు. మొదటి దశ అడ్మిషన్లను జూన్‌ 27 నుంచి ప్రారంభిస్తారు. జులై 20లోపు అడ్మిషన్లు పూర్తి చేస్తారు. ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం తరగతుల్ని జులై1 నుంచి ప్రారంభిస్తారు.

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే విద్యార్ధుల కోసం రెండో దశ అడ్మిషన్లను కూడా నిర్వహిస్తారు. ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం విద్యార్ధులకు జులై 1 నుంచి తరగతులు మొదలవుతాయి. ఇంటర్నెట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న మార్కుల జాబితాల ఆధారంగా ప్రవేశాలను కల్పించవచ్చని కళాశాలలకు బోర్డు సూచించింది. పదో తరగతి ఒరిజినల్‌ మార్కుల జాబితా, టీసీలను సమర్పించిన తర్వాత అడ్మిషన్లను ఖరారు చేయాల్సి ఉంటుంది. పదో తరగతిలో వచ్చిన మార్కులు, గ్రేడ్‌ పాయింట్ల ఆధారంగా అడ్మిషన్లు నిర్వహించాల్సి ఉంటుంది. ఇంటర్‌ ప్రవేశాల కోసం ఎలాంటి ప్రవేశపరీక్షలు నిర్వహించకూడదని బోర్డు స్పష్టం చేసింది. ప్రైవేట్ కళాశాలలు పరీక్షల్ని నిర్వహిస్తే వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు బోర్డు కార్యదర్శి శేషగిరి బాబు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version