ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విధానాల వల్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం.. శ్రీలంకలా మారే ప్రమాదం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ప్రధాన మంత్రి మోడీ వద్ద ఉన్నత అధికారులు చేసిన వ్యాఖ్యలే.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పరిస్థితిని తెలియజేస్తుందని వ్యాఖ్యానించారు. కాగ నేడు టీడీపీ నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా సీఎం జగన్ పై విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వంపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వ్యతిరేకత మొదలైందని అన్నారు.
సీఎం జగన్ సొంత సామాజిక వర్గం నుంచే అసంతృప్తి ఎక్కువ ఉందని అన్నారు. అలాగే ఆయన వర్గంలో కూడా చాలా మంది.. జగన్ కు ఎందుకు ఓటు వేశామని బాధ పడుతున్నారని తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటు కూడా శాస్త్రీయంగా జరగలేదని తప్పుబట్టారు. రాజకీయ కోణంతోనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని ఫైర్ అయ్యారు. కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రజల అభిప్రాయాలను, ఆందోళనలను, వినతులను జగన్ సర్కార్ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త జిల్లాలను, రెవెన్యూ డివిజన్లను సరిదిద్దుతామని ప్రకటించారు.