మేం ధమ్కీలు ఇవ్వలేదు పియూష్ గోయలే తప్పుదోవ పట్టించారు : టీఆర్ఎస్ ఎంపీలు

-

మేం ఎటువంటి ధమ్కీలు పియూష్ గోయల్ కు ఇవ్వలేదు..ఆయనే తప్పుగా మాట్లాడారని ఫైర్ అయ్యారు తెరాస ఎంపీ కే కేశవరావు. కేంద్రానికి, తెలంగాణ కు ధర్మయుద్దం సాగుతోందని.. మన వద్ద రెండు సార్లు వరి పంట వస్తుందని పేర్కొన్నారు. దశాబ్దాలుగా ఇదే పరిస్థితి అని… ఎగుమతులు చేయటం లేదని చెప్పటం తప్పే అని మండిపడ్డారు.

k keshava rao

తెలంగాణా మాత్రమే కాదు ఇతర రాష్ట్రాలు ధాన్యం కొనుగోల్ల పై మాట్లాడుతున్నారు..మా రైస్ కు ఎందుకు మార్కెట్ కల్పించటం లేదు… దేశవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు విషయంలో ఒకే పాలసీ ఉండాలని డిమాండ్ చేశారు. సభను పీయూష్ గోయల్ తప్పుదోవ పట్టించారు..అందుకే పియూష్ గోయల్ పై సభాహక్కుల నోటీస్ ఇచ్చామని స్పష్టం చేశారు.

అనంతరం నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పార్లమెంట్ ఉభయసభల్లో సభాహక్కుల ఉల్లoఘన నోటీస్ ఇచ్చాం..తెలంగాణ రైతులపై కేంద్రం కక్ష్య కట్టిందన్నారు. కేంద్రం మాటలు మార్చి రైతులను ఇబ్బంది పెడుతున్నారు… కేంద్రం ఆధ్వర్యంలో బియ్యం ఎగుమతి జరుగుతోందన్నారు. కేంద్రానికి తెలంగాణ పై మనస్సు లేదు.. తెలంగాణ రైతులతో మీకు బుద్ది చెప్తామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version