ఆంధ్ర ప్రదేశ్ లో ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు.ఉత్తీర్ణులు సాధించిన ర్యాంకులు, వివరాల కోసం ఏపీ ఐసెట్ అధికారిక వెబ్‌సైట్ cets. apsche.ap.gov.in ని సందర్శించవచ్చు.
ఫలితాల్లో 96.71 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎంసీఏతో పాటు ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశానికి మే 6న ఏపీలో 111, తెలంగాణలో 2 సెంటర్లలో ఐసెట్ నిర్వహించగా పరీక్షలకు మొత్తం 48,828 మంది అప్లై చేసుకున్నారు. 44,446 మంది పరీక్ష రాయగా 42,984 మంది అర్హత సాధించారు.
1. ఎ. క్రాంతికుమార్ 176.81 (ఎన్టీఆర్ జిల్లా)
2 గున్నం సాయి కార్తిక్ (తూర్పుగోదావరి జిల్లా)
3 .సూరిశెట్టి వసంతలక్ష్మి (విశాఖపట్నం)
4. కడపన గణేష్ కుమార్ రెడ్డి (అనంతపురం)
5. సామిరెడ్డి తరుణ్ కుమార్ (విజయనగరం)
6.ఎస్. దశరథరామరెడ్డి (తూర్పుగోదావరి)
7.కొర్లం శ్రీకుమార్ (శ్రీకాకుళం)
8. పుచ్చా అనుపమ (తూర్పుగోదావరి)
9. దవనబోయన వెంకటేశ్ (అనంతపురం)
10. దొరై మునిశేషాద్రి గిరీష్ సాయి (చిత్తూరు)