మెగా డీఎస్సీ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. https://apdsc.apcfss.in/ లో జాబితాను చెక్ చేసు కో వచ్చు. డీఎస్సీ సెలక్షన్ లిస్ట్ ను మంత్రి నారా లోకేష్ రిలీజ్ చేశారు. తాము ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటామని నారా లోకేష్ పేర్కొన్నారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి అయినట్లుగా పేర్కొన్నారు.

150 రోజుల్లోనే మెగా డీఎస్సీని విజయవంతంగా పూర్తి చేశామని పేర్కొన్నారు. సెలెక్ట్ అయిన వారికి స్పెషల్ గా నారా లోకేష్ విషెస్ చెప్పారు. ఈనెల 19న అపాయింట్మెంట్ లెటర్లను ఇచ్చి దసరా సెలవుల అనంతరం వారిని విధుల్లోకి తీసుకొనున్నట్లుగా సమాచారం అందుతుంది.
- సెలక్షన్ లిస్ట్ విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్
- 16,347 టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి
- https://apdsc.apcfss.in వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్న అభ్యర్థుల జాబితా
- డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్