అందుకే ఏపీకి అమూల్ ప్రాజెక్టు !

-

5,386 కోట్లను పాడి పశువులు, గొర్రెల కొనుగోలుకు కేటాయించామని  మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా వీటిని పంపిణీ చేస్తామని ఆయన అన్నారు. పెద్ద ఎత్తున ఈ పథకానికి డిమాండ్ వస్తోందన్న ఆయన ఇతర రాష్ట్రాల నుంచి కూడా పశువులను కొనుగోలు చేస్తామని అన్నారు. మహిళలు స్వయం ఉపాధి పొందేలా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని, ముర్రా జాతి , మేలు రకమైన పశువులను కొనుగోలు చేస్తామని అన్నారు.

రెండున్నర లక్షల మంది గొర్రెలు, మేకల కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఒక్కో యూనిట్ 75 వేలు, అదనంగా కాపరులకు కిట్ ఇస్తామని అన్నారు. అమూల్ సంస్థతో దేశంలో ఎక్కడా లేని విధంగా ఒప్పందం చేస్తున్నామన్న మంత్రి నవంబర్ 26న ఏపీ అమూల్ ప్రారంభిస్తామని అన్నారు. ఈ రోజు నుంచే పాల సేకరణ ప్రారంభమైందని అన్నారు. ప్రతి రైతు భరోసా కేంద్రం పరిధిలో మహిళలతో సహకార సొసైటీ పెట్టిస్తున్నామని, ప్రతి ఆర్బీకేలో పాల సేకరణకు అవసరమైన సదుపాయాలు ప్రభుత్వమే కల్పిస్తుందని అన్నారు. ఇందుకోసం రూ. 1362 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్న ఆయన పాలపై లీటరుకు అదనంగా రూ.4 కంటే ఎక్కువ రైతుకు దక్కేలా చేస్తామని అన్నారు. మార్కెట్లో పోటీ వాతావరణం కల్పించి రైతుకు అధిక ధర వచ్చేలా చేస్తామని అన్నారు. అందుకే ఏపీ అమూల్ ప్రాజెక్టు తెచ్చామని అన్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version