ఆహా ఓటీటీ క్లిక్ అవ్వడానికి ఆ సినిమానే కారణమా

-

థియేటర్‌లో బొమ్మ పడితే సినిమా హిట్టో ఫట్టో చెప్పేయొచ్చు. మరి ఓటీటీలో రిలీజైతే. సక్సెస్‌ అయిందో.. ఫెయిల్‌ అయిందో తెలుసుకోవడం ఎలా? ఓటీటీ యాజమాన్యం లెక్కలు బైటకు చెబితేగానీ.. రిజల్ట్‌ తెలీదు. కానీ.. వాళ్లు చెప్పకపోయినా.. సబ్‌స్క్రైబర్స్ పెరిగితే.. ఆ సినిమా హిట్‌ అయినట్టే. 100 పర్సెంట్ తెలుగు ఓటీటీ ఆహాను సబ్‌స్క్రైబర్స్‌ను పెంచిన సినిమా ఏమిటి?

సుహాస్‌, చాందిని చౌదరి జంటగా నటించిన చిత్రం ‘కలర్‌ఫొటో’. సుహాస్‌ కమెడియన్‌గా పరిచయమేగానీ.. హీరోగా ఇదే ఫస్ట్‌ మూవీ. దర్శకుడు సందీప్‌ రాజ్‌కు క్రేజ్‌ లేదు. అయితే.. సినిమా టీజర్స్‌.. సాంగ్స్ సినిమాకు హైప్‌ తీసుకొచ్చాయి. దీనికి తోడు ఓటీటీ ఆహా చేసిన భారీ ప్రచారం సినిమా హైప్‌కు ఉపయోగపడింది. దీనికి తోడు.. బాగుందన్న టాక్‌ రావడంతో… కలర్‌ ఫొటో టాక్ ఆఫ్‌ది ఇండస్ట్రీగా మారింది.

ఆహాలో ఇప్పటిదాకా రిలీజైన కొత్త సినిమాలన్నింటిలో అత్యధిక వ్యూస్ కలర్‌ఫొటోకు వచ్చాయి. కలర్‌ఫొటో 50 మిలియన్ మినిట్స్ స్ట్రీమ్ అయినట్లుగా పోస్టర్‌ రిలీజ్ చేశారు. అలాగే కలర్‌ఫొటో తర్వాత ఆహాకు కొత్త సబ్‌ స్కైబర్స్‌ పెరిగారట. ఇలా చిన్న సినిమా హిట్‌ అయితే ఓటీటీకి .. ఓటీటీలో తగిన పబ్లిసిటీ దక్కితే మూవీకి లాభం చేకూరుతుందన్న దానికి కలర్‌ఫొటో ఎగ్జాంపుల్‌గా నిలిచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version