సీఎం కేసీఆర్ కు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన మంత్రి కారుమూరి !

-

ఇటీవల కేసీఆర్ తమ గొప్పలు చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా ఒక బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ను కించపరిచే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కేసీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈయన మాట్లాడుతూ… కేసీఆర్ వరుసగా రెండవసారి సీఎం అయినప్పటికీ తెలంగాణాలో పేదరికం ఇసుమంత కూడా తగ్గలేదని, అదే సమయంలో ఏపీలో సీఎం జగన్ పేదరికాన్ని కేవలం నాలుగు సంవత్సరాల్లోనే తగ్గించినట్లు చెప్పుకొచ్చారు. వర్షం వలన జరిగే నష్టాన్ని ఎలా అదుపు చేయాలో కేసీఆర్ ఆలోచించాలంటూ కారుమూరి విమర్శించారు. ఇక రైతుల నుండి బియ్యాన్ని కొనలేకపోతున్నామన్న మాటలకు కూడా కారుమూరి స్ట్రాంగ్ గా బదులిచ్చారు.. కేసీఆర్ ప్రభుత్వం ఏపీ లో పండిన సన్న బియ్యాన్ని ఎక్కువ ధరకు కొని తింటున్నారంటూ కామెంట్ చేశారు.

మేము ఎప్పుడూ ఒక మంచి విజన్ తోనే పాలన చేస్తున్నామని కారుమూరి నాగేశ్వరరావు సీఎం కేసీఆర్ కు అర్థమయ్యేలా చెప్పారు. మరి ఈ వ్యాఖ్యలపై కేసీఆర్ అండ్ టీం ఏమైనా స్పందిస్తారా చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version