గత ప్రభుత్వంలో ఎక్కడ చూసిన అరాచకాలే : రవాణా శాఖ మంత్రి

-

గాలివీడు మండలంలోని వెలిగల్లు ప్రాజెక్టులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో 4.80 లక్షల చేప పిల్లలను వదిలారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి కీలక కామెంట్స్ చేశారు. మత్స్యకారుల అభివృద్ధే కూటమి ప్రభుత్వం ద్వేయం. మత్స్యకారులకు డీజిల్ లో రాయితీ, సబ్సిడీ ద్వారా పవర్, డీజిల్, చేతి బోట్లు ఇస్తున్నాం. రాష్ట్రంలోని కుల వృత్తుల వారికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల్లో ఎలాంటి లోటు పాట్లు, సమస్యలు లేకుండా అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందుకెళ్తుంది. గ్రామాలలో నెలకొన్న నీటి సమస్య ను తీర్చుతున్నాం.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడ చూసిన అరాచకాలు జరిగేవి. పార్టీలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు తమ ప్రభుత్వం ముందుంది. 300 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వెలిగల్లు ప్రాజెక్టు ద్వారా రాయచోటి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి త్రాగునీరు అందిస్తాం. చిన్నమండెం మండలంలోని శ్రీనివాసపురం రిజర్వాయర్ పెండింగ్ పనులను పూర్తి చేస్తాం. హంద్రీనీవా కాల్వల ద్వారా రెండువేల ఎకరాలకు సాగునీరు అందిస్తాం అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news