ఆరోగ్యశ్రీ అంటే YSR గుర్తొస్తారు.. రైతుబంధు అంటే KCR గుర్తొస్తారు అని పేర్కొన్నారు కేటీఆర్. KCR ఆనవాళ్లు చెరిపేద్దామని.. రైతుబందు బంద్ చేసే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నడు అని ఆగ్రహించారు కేటీఆర్.
ఇవాళ నల్గొండ లో కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్బంగా రైతు దీక్ష లో పాల్గొన్నారు కేటీఆర్. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ నల్గొండ ఐటీ టవర్ కళ తప్పిందన్నారు. కోమటిరెడ్డి వచ్చాక ఐటీ టవర్ తాగుబోతులకు అడ్డాగా మారిందేమో ? అంటావు చురకలు అంటించారు కేటీఆర్.
కేసీఆర్ ఉన్నప్పుడు చాలా బాగుండేది.. కాంగ్రెస్ వచ్చాక గొడ్డుకారం పెడుతున్నారు. యూనివర్సిటీలోకి మీరు వచ్చి మా బాధలు చూడాలన్న అని కోరారన్నారు. తిరుగు ప్రయాణంలో ఆ యూనివర్సిటీలోకి వెళ్లి విద్యార్థుల సమస్యలు తెలుసుకుంటానని ప్రకటించారు. –
https://twitter.com/TeluguScribe/status/1884154270351757812