ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత బస్సు… కీలక ప్రకటన వెలువడింది. ఉచిత బస్సు ప్రయాణం జిల్లాల వరకు మాత్రమే… అంటూ ఏపీ మంత్రి సంధ్యారాణి ప్రకటన చేయడం జరిగింది. మహిళలకు ఉచిత బస్సు కేవలం జిల్లాలకే పరిమితం చేస్తున్నట్లు వివరించారు. ఉచిత బస్సు పథకం అమల్లోకి వస్తే… మహిళలు అన్నవరం నుంచి తిరుపతి వెళ్లేందుకు ఎదురుచూస్తున్నారని వైసీపీ సభ్యులు పీవీ సూర్యనారాయణ రాజు… మండలిలో నిలదీశారు.

అయితే దీనిపై మంత్రి సంధ్యారాణి స్పందించారు. ఏ జిల్లాలోని మహిళలకు.. ఆ జిల్లాల్లోని ఆర్టీసీ ప్రయాణానికి అనుమతించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎన్నికల హామీల్లో కూడా ఇదే చెప్పినట్లు ఆమె వెల్లడించడం జరిగింది. దీంతో ఏపీ ప్రభుత్వం నిర్ణయం పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేస్తున్న పథకం తరహాలోనే ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు ఏపీ ప్రజలు.