తెలంగాణ సమస్యలకు పరిష్కారం బీజేపీ : కాగజ్ నగర్ ఎమ్మెల్యే

-

బీజేపీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుంది. ఉత్తర తెలంగాణ రాష్ట్రంలో రెండు ఎన్నికలు జరగగా బీజేపీ నే గెలిచింది. తెలంగాణ సమస్యలకు పరిష్కారం బీజేపీ అని సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. బీజేపీ గెలుపుకు సంఘం శక్తినే పని చేసింది. 42 నియోజక వర్గాల్లో జరిగిన ఎన్నికల్లో 15 నుండి 20 రోజుల్లో చిన్న చిన్న గ్రూప్ లుగా విభజించి పని చేశాం. 25 మందికి ఒక ఇన్చార్జి పెట్టీ పని చేశాం, కార్యకర్తలు శక్తి వంచన లేకుండా పని చేస్తేనే విజయం సాధ్యమైంది. ఉత్తర తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 25 సీట్లు, ముగ్గురు మంత్రులు ఉండి కూడ ఓడిపోయింది.

ఒక సాధారణ వ్యక్తినీ తీసుకుని వచ్చి పోటీ చెపిస్తే మేధావులు బీజేపీ కి పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీ 16 నెలల్లో పూర్తిగా విఫలమయ్యారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి 10 శాతం కమిషన్ ఇచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా గాడి తప్పింది, అప్పుల ఊబిలోకి ప్రభుత్వం కూరుకుపోయింది. అసెంబ్లీలో బీజేపీ తరపున రాష్ట్రంలోని సమస్యల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. రాష్ట్రం పూర్తిగా దివాల తీసింది, రెవిన్యూ లోటు లోకి కూరుకుపోయింది. రెండు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని పాల్వాయి హరీష్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news