అన్న..మనోళ్లని కనబడమను!

-

ఇప్పుడు ఏపీ ప్రజల దగ్గర నుంచి ఈ మాట ఎక్కువ వినిపిస్తుంది. ఈ సారైనా ఏపీ ఎంపీలు లోక్‌సభలో పోరాడాలని చెప్పి జగన్‌కు పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయి. ఎందుకంటే ఇంతకాలం కేంద్రం నుంచి రాష్ట్రానికి గొప్ప సాయమేమి అందలేదు. ఇప్పటికే రాష్ట్ర విభజనతో ఏపీ బాగా నష్టపోయింది. ఎనిమిదేళ్ళ నుంచి విభజన హామీలని కేంద్రం పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. దీనిపై ఏపీ ఎంపీలు పోరాడాల్సిన అవసరముంది.

Jagan

ఇంకా చెప్పాలంటే వైసీపీ ఎంపీలకు పోరాడాల్సిన బాధ్యత ఎక్కువ ఉంది. అసలు వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నారు..వారు ఈ రెండున్నర ఏళ్లలో రాష్ట్రం కోసం పోరాడిందే తక్కువ..అసలు కొందరు ఎంపీలైతే పోరాడినట్లే కనిపించలేదు. అసలు చెప్పాలంటే టీడీపీకి చెందిన ముగ్గురు ఎంపీల రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎక్కువ పోరాడారు. ఈ రెండున్నర ఏళ్లలో రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, గల్లా జయదేవ్‌లు రాష్ట్రం కోసం లోక్‌సభలో గళం విప్పారు. మరి వైసీపీకి ఉన్న 22 మంది ఎంపీల్లో ఎంతమంది రాష్ట్రం కోసం పోరాడారో చెప్పలేని పరిస్తితి.

ఏదో మిథున్ రెడ్డి మాత్రం అప్పుడప్పురు లోక్‌సభలో రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడారు…మరి మిగిలిన ఎంపీలు ఏం చేశారో పెద్దగా క్లారిటీ లేదు. అలాగే వైసీపీతో విభేదించి రెబల్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణం రాజు సైతం రాష్ట్రం కోసం బాగానే పోరాడుతున్నారు. కానీ అధికారంలో ఉన్న వైసీపీ ఎంపీలు నోరు విప్పడం లేదు.

విచిత్రం ఏంటంటే..వైసీపీ ఎంపీల్లో కొందరైతే పెద్దగా పార్లమెంట్‌లో కనిపించిన సందర్భాలు కూడా లేవు. పైగా కొందరు ఎంపీలు అనే సంగతి ప్రజలకు కూడా తెలియదు. అంటే వైసీపీ ఎంపీల పరిస్తితి అలా ఉంది. అందుకే ఇకనుంచైనా వైసీపీ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలని, కనీసం పోరాడినట్లు లోక్‌సభలో కనిపించిన చాలని జనాలు అనుకుంటున్నారు. మరి చూడాలి ఈ సారి వైసీపీ ఎంపీలు ఏ మాత్రం ప్రజలకు కనిపిస్తారో.

Read more RELATED
Recommended to you

Exit mobile version