చంద్ర‌బాబు దీక్ష‌కు.. పోలీసులు కొత్త ట్విస్ట్..

-

ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికులకు అండగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 14న విజయవాడలో దీక్షకు సంకల్పించిన సంగతి తెలిసిందే. ఈనెల 14న ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకూ దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో దీక్షకు అనుమతి ఇవ్వాలని పోలీసులను, మున్సిపల్‌ కమిషనర్‌ను టీడీపీ నేతలు కోరారు. అయితే, ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రమే వినియోగంచే మున్సిపల్ స్టేడియంలో అనుమతి ఇవ్వలేమంటూ పోలీసు ఉన్నతాధికారులు తేల్చి చెప్పారు.

దీంతో..టీడీపీ నేతలు దీని పైన అధినేతకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఒకరోజు నిరాహార దీక్ష సందిగ్దంలో పడింది. ఇదిలా ఉంటే.. ప్రభుత్వం అనుమతి నిరాకరించినా చంద్రబాబు దీక్ష జరిగి తీరుతుందని టీడీపీ నేతలు తేల్చిచెప్పారు. దీంతో, ప్రత్యామ్నాయంగా ధర్నా చౌక్ ను టీడీపీ నేతలు పరిశీలిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు దీక్ష కొనసాగుతుందని వారు తెలిపారు. ఏదేమైన మ‌రో రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version