ఏపీ ప్రభుత్వం మెల్లిగా ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తోంది. ఓ వైపు ఉద్యోగులతో చర్చలు జరుపుతూనే.. మరో వైపు చర్చలు సఫలం కాకపోతే చర్యలు తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దం అవుతోంది. ఎస్మా చట్టాన్ని ప్రయోగించేందుకు సిద్దం అయినట్లు తెలుస్తోంది.
తాజాగా ఏపీలోని గనుల శాఖలో ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. ఈమేరకు గనుల శాఖ డైరెక్టర్ వెంకట్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసింది. గనుల శాఖలో అత్యవసర సేవలు ఏం ఉంటాయని ఉద్యోగులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఓవైపు ఉద్యోగులతో చర్చలు జరుపుతున్న సమయంలో ఎస్మా ఉత్తర్వులు సరికాదంటున్నారు. మరోవైపు ఉద్యోగుల పీఆర్సీ డిమాండ్లు, సమ్మె ఇతర అంశాలపై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ తో మంత్రుల కమిటీ భేటీ అయింది. ప్రస్తుతం ఉద్యోగులు కోరుతున్న హెచ్, ఐఆర్ రికవరీ అంశాలపై మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల నేతలతో చర్చిస్తోంది.
ESMA Act : ఎస్మా అంటే ఏమిటి..? ఈ యాక్టు నియమ నిబంధనలు ఏమిటి