క్రికెట్ అంటే… ఓ పవిత్రమైన ఆట. ఈ గేమ్ లో రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. క్రికెటర్లు కచ్చితంగా.. చాలా నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అయితే.. అలాంటి ఆటకే ఆఫ్గాన్ క్రికెటర్ మచ్చ తెచ్చేలా వ్యవహరించాడు. క్రికెట్ స్టేడియంలలో సిగరేట్ కాల్చి… వివాదానికి తెరలేపాడు క్రికెటర్ షహజాద్. అతని ప్రవర్తనతో ఆగ్రహానికి గురైన అధికారును.. తీవ్రంగా మందలించారు.
ఈ ఘటన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ సందర్భంగా శుక్రవారం చోటు చేసుకుంది. శుక్రవారం కొమిల్లా విక్టొరియన్స్, మినిస్టర్ గ్రూప్ ఢాకా జట్ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఆటగాళ్లు.. మైదానంలోకి వచ్చారు.
ఆ సమయంలో.. షహజాద్ ఎలక్ట్రానిక్ సిగరేట్ తాగుతూ కనిపించాడు. సహచార ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి తాగమని చెప్పినా.. వినకుండా మైదానంలోనే సిగరేట్ తాగాడు. దీంతో అతను సిగరేట్ తాగుతున్న ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక ఈ సంఘటనపై క్రికెట్ ఫ్యాన్స్ కూడా తెగ సీరియస్ అవుతున్నారు.