BREAKING : గంజాయి సరఫరాలో మొదటి స్థానంలో ఏపీ

-

గంజాయి సరఫరాలో మొదటి స్థానంలో ఏపీ నిలిచింది. అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ నుండి 26% గంజాయిని స్వాధీనం చేసుకున్న ఆధికారులు.. ఒక ఆంధ్ర ప్రదేశ్ లోనే రెండు లక్షల కిలోలకు పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో 2021 నివేదిక తాజాగా విడుదల అయింది. గత ఏడాది స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల పై ఎన్సీబీ నివేదిక రిలీజ్ చేసింది.

దేశవ్యాప్తంగా ఏడు లక్షల కిలోల గంజాయి స్వాధీనం తీసుకున్నారు. అయితే ఈ లిస్ట్ లో రెండో స్థానంలో నిలిచింది ఒడిస్సా. 50 శాతానికి పైగ ఆంధ్ర ,ఒడిస్సా రాష్ట్రాల నుండే గంజాయి సాగు జరుగుతున్నట్లు, గత ఏడాది ఏపీలో 18 కిలోల హాశిష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నట్లు నివేదికలో తెలిపారు. అలాగే గంజాయి సరఫరా పై 1775 కేసు లు నమోదు చేశారట. ఏపీ లో గంజాయి తరలిస్తూ పట్టుబడిన 4202 మందినీ అరెస్ట్ చేసారు పోలీసులు. ఇక గత ఏడాది తెలంగాణలో 35270 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎన్సీబీ నివేదిక ప్రకారం అత్యధిక మత్తుపదార్థాల ప్రభావం పంజాబ్ లో ఉన్నట్టు నివేదిక తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version