BREAKING : ఏపీ కొత్త కేబినేట్‌ జాబితా విడుదల..

-

ఆంధ్ర ప్రదేశ్ మంత్రులు జాబితా దాదాపు ఖరారు అయింది. ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి తో కలిసి… సజ్జల రామకృష్ణా సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలోనే మంత్రుల లిస్టును ఫైనల్‌ చేశారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.

ఈ లిస్టు ప్రకారం… మంత్రి వర్గంలో బొత్స సత్యనారాయణ, రాజన్నదొర, ధర్మాన ప్రసాదరావు, శ్రీధరి అప్పలరాజు, భాగ్యలక్ష్మి,, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, చిట్టి బాబు, వేణు గోపాల కృష్ణ, గుమ్మనూరు జయరాం, జొన్నలగడ్డ పద్మావతి, శంకర్ నారాయణ, పెద్దిరెడ్డి, కె నాగేశ్వరరావు, గ్రంధి శ్రీనివాస్, జోగి రమేష్, కొడాలి నాని, రక్షణ నిధి, అంజద్ భాష, బుగ్గన రాజేంద్రనాథ్,  కోరుట్ల శ్రీనివాస్, శిల్పా చక్రపాణి రెడ్డి ఉన్నట్లు సమాచారం అందుతోంది. దీంతో వారి వారి నియోజక వర్గాల్లో సంబురాలు చేసుకున్నారు వైసీపీ నేతలు. ఇప్పటి వరకు వీరు మాత్రమే కేబినేట్‌ మంత్రులుగా ఫైనల్‌ అయ్యారు. రేపటి వరకు మరికొంత పేర్లు ఈ జాబితాలో చేర్చే ఛాన్స్‌ ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version