రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు ఏమాత్రం తగ్గడం లేదు. దాదాపు పది రోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. వరుసగా వర్షాలు పడుతున్నాయి. ఇక ఏపీలో కూడా అత్యంత భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ కొన్ని పాఠశాలలకు… హాలిడే కూడా ప్రకటించారు.

ఈ భారీ వర్షాల నేపథ్యంలో విశాఖ అనకాపల్లి కాకినాడ అల్లూరి విజయనగరం శ్రీకాకుళం, పార్వతిపురం మన్యం జిల్లాలలో.. ప్రవేట్ అలాగే ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు అధికారులు. విద్యార్థుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా వెల్లడించారు. మరోవైపు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి అలాగే పశ్చిమగోదావరి అటు ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలలో కూడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు దారి చేసింది. దీంతో ఈ జిల్లాలలో పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నారు తల్లిదండ్రులు.