ఏపీకి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ ద్రోణి / గాలుల కోత ఇప్పుడు అంతర్గత తమిళనాడు నుండి విదర్భ వరకు రాయలసీమ మరియు ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నది. సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో రాయలసీమ & పరిసర ప్రాంతాలలో ఉపరితల అవర్తనము కొనసాగుతున్నది. దీంతో ఏపీకి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం , దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాల్లో.. ఈ రోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. రేపు మరియు ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉందని అమరావతి వాతావరణ కేంద్రము పేర్కొంది.