ఏపీకి తప్పని ముప్పు.. మళ్లీ భారీ వర్షాలు !

-

ఏపీకి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. నిన్నటి జవాద్ తుఫాను, తీవ్ర వాయుగుండం గా బలహీన పడి వాయవ్యబంగాళా ఖాతంమరియు దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళా ఖాతం మీద, గత 6 గంటలలో , గంటకు 20 కి మీ వేగం తో ప్రయాణించి ఈ రోజు డిసెంబర్ 5 వ తేదీ 8 గంటల 30 నిముషాలకు 18 . 7 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 85 .6 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై, విశాఖపట్నంకు తూర్పు ఈశాన్యం గా 270 కిలోమీటర్లు దూరములో, గోపాల్ పూర్(ఒడిశా ) కు దక్షిణ ఆగ్నేయం గా 90 కిలోమీటర్లు దూరములో, పూరి (ఒడిశా ) కు దక్షిణ నైరుతి గా 120 కి మీ దూరము లో మరియు పరాదీప్ (ఒడిశా ) కు దక్షిణ నైరుతి గా 210 కిలోమీటర్లు దూరములో ఉన్నది .

ఇది ఉత్తర ఈశాన్య దిశగా ప్రయా ణం కొనసాగించి వాయుగుండం గా బలహీన పడి,తదుపరి 6 గంటలలో ఒడిశా తీరం దగ్గర ఉన్న పూరి దగ్గర కు చేరుతుంది. ఆ తరువాత ఉత్తర ఈశాన్య దిశగా ఒడిస్సా తీరము వెంబడి ప్రయాణం కొనసాగించి పశ్చిమ బెంగాల్ తీరం వైపుకు వెళ్లే అవకాశం ఉంది. ఆ తరువాత ఈ రోజు అర్థ రాత్రి కి తీవ్ర అల్ప పీడనం గా బలహీన పడే అవకాశం ఉంది. వీటి ఫలితంగాఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ లోని పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version