దేశంలో 50 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి…

-

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. ఓమిక్రాన్ నేపథ్యంలో వ్యాక్సిన్లు తీసుకోవాలని ప్రభుత్వాలు కూడా ప్రజలను కోరుతున్నాయి. తాజాగా ఇండియాలో అర్హులైన జనాభాలో 50 శాతం మందికి రెండు డోసుల కరోనా వ్యాక్సినేషన్ పూర్తయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మండవీయ తెలియజేశారు. భారతదేశంలోని వయోజన జనాభాలో 84.8 శాతం మందికి మొదటి డోసు వ్యాక్సినేషన్ పూర్తయింది. దేశంలో మొత్తంగా 127.61 కోట్లు డోసుల వ్యాక్సినేషన్ అర్హులైన ప్రజలకు అందించారు.

మొదటి దశలో ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు జనవరి 16న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఫిబ్రవరి 2న వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. తరువాతి దశలో మార్చి 1 నుంచి 60 ఏళ్లకు పైబడినవారికి తరువాత ఎప్రిల్ 1 నుంచి 45 ఏళ్లకు పైబడిన వారికి కరోనా టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. మే 1 నుంచి 18 ఏళ్లకు పైబడిన వారందరికీ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించారు. ప్రస్తుతం హర్ ఘర్ కి దస్తక్ ప్రోెగ్రాం ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మోదీ ప్రభుత్వం ఇంటింటికి తీసుకెళ్తుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version