ఆపిల్ నుంచి 27 ఇంచుల కొత్త 5కె ఐమ్యాక్‌.. ధ‌ర ఎంతంటే..?

-

సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్ 27 ఇంచుల డిస్‌ప్లే క‌లిగిన కొత్త ఐమ్యాక్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఈ సిరీస్‌లో వ‌చ్చిన ఐమ్యాక్‌ల‌లో ఇంటెల్ 10వ జ‌న‌రేష‌న్ ప్రాసెస‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. 128జీబీ వ‌ర‌కు ర్యామ్‌ను అందిస్తున్నారు. ఏఎండీ గ్రాఫిక్స్‌, 8టీబీ వ‌ర‌కు ఎస్ఎస్‌డీ స‌దుపాయం, ట్రూ టోన్ డిస్‌ప్లే, 1080పి ఫేస్‌టైం హెచ్‌డీ కెమెరా, హయ్య‌ర్ ఫిడెలిటీ స్పీక‌ర్‌, స్టూడియో క్వాలిటీ మైక్‌ల‌ను అందిస్తున్నారు.

apple launched 27 inch 5k retina new imacs in india

ఐమ్యాక్ లో 27 ఇంచుల రెటీనా 5కె డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇది 5120 x 2880 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూషన్‌ను క‌లిగి ఉంటుంది. ఏఎండీ రేడియాన్ ప్రొ 5000 సిరీస్ గ్రాఫిక్స్‌ను ఏర్పాటు చేసినందున గ‌త ఐమ్యాక్‌ల క‌న్నా 55 శాతం ఎక్కువ గ్రాఫిక్స్ పెర్ఫార్మెన్స్‌ను ఈ కొత్త ఐమ్యాక్‌లు ఇస్తాయి. బేసిక్ ర్యామ్ 8జీబీ ల‌భిస్తుంది. దాన్ని ఏకంగా 128జీబీ వ‌రకు అవ‌స‌రం అనుకుంటే పెంచుకోవ‌చ్చు. అలాగే 256జీబీ/512జీబీ ఎస్ఎస్‌డీ ఆప్ష‌న్లు ల‌భిస్తాయి. ఎస్ఎస్‌డీని 8టీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు.

సెక్యూరిటీ కోసం ఈ ఐమ్యాక్‌ల‌లో ఆపిల్ టి2 సెక్యూరిటీ చిప్‌ను ఏర్పాటు చేశారు. అందువ‌ల్ల యూజ‌ర్ల డేటాకు పూర్తి స్థాయిలో భ‌ద్ర‌త ల‌భిస్తుంది. ఇక ఇప్ప‌టికే అందుబాటులో ఉన్న 21.5 ఇంచుల ఐమ్యాక్‌, ఐమ్యాక్ ప్రొ మోడ‌ల్స్‌ను కూడా అప్‌డేట్ చేశారు. వాటిల్లో కొత్త ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

ఆపిల్ నూత‌న ఐమ్యాక్‌ల ధ‌ర‌లు ఇలా ఉన్నాయి…

* 27 ఇంచుల 5కె రెటీనా ఐమ్యాక్‌, 3.1 గిగాహెడ్జ్ ఇంటెల్ 10వ జ‌న‌రేష‌న్ కోర్ ఐ5 ప్రాసెస‌ర్‌, రేడియాన్ ప్రొ 5300 4జీబీ గ్రాఫిక్ కార్డ్‌, 8జీబీ ర్యామ్‌, 256జీబీ ఎస్ఎస్‌డీ మోడ‌ల్ ధ‌ర – రూ.1,69,900

* 27 ఇంచుల 5కె రెటీనా ఐమ్యాక్ 3.3 గిగాహెడ్జ్ ఇంటెల్ 10వ జ‌న‌రేష‌న్ కోర్ ఐ5 ప్రాసెస‌ర్‌, రేడియాన్ ప్రొ 5300 4జీబీ గ్రాఫిక్ కార్డ్‌, 8జీబీ ర్యామ్‌, 512జీబీ ఎస్ఎస్‌డీ మోడ‌ల్ ధ‌ర – రూ.1,89,900

* 27 ఇంచుల 5కె రెటీనా ఐమ్యాక్ 3.8 గిగాహెడ్జ్ ఇంటెల్ 10వ జ‌రేష‌న్ కోర్ ఐ7 ప్రాసెస‌ర్‌, రేడియాన్ ప్రొ 5500 8జీబీ గ్రాఫిక్ కార్డ్‌, 8జీబీ ర్యామ్‌, 512 జీబీ ఎస్ఎస్‌డీ మోడ‌ల్‌ ధ‌ర – రూ.2,19,900

అప్‌డేట్ చేయ‌బ‌డిన 21.5 ఇంచుల ఐమ్యాక్ ధ‌ర‌లు ఇలా ఉన్నాయి…

* 21.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ఐమ్యాక్ 2.3 గిగాహెడ్జ్ డ్యుయ‌ల్ కోర్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెస‌ర్‌, ఇంటెల్ ఐరిస్ ప్ల‌స్ గ్రాఫిక్స్ 640, 8జీబీ ర్యామ్‌, 256 జీబీ ఎస్ఎస్‌డీ మోడ‌ల్ ధ‌ర – రూ.99,900

* 21.5 ఇంచుల 4కె రెటీనా ఐమ్యాక్ 3.6 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెస‌ర్‌, రేడియాన్ ప్రొ 555ఎక్స్ 2జీబీ గ్రాఫిక్ కార్డ్‌, 8జీబీ ర్యామ్‌, 256జీబీ ఎస్ఎస్‌డీ మోడ‌ల్ ధ‌ర – రూ.1,19,900

* 21.5 ఇంచుల 4కె రెటీనా ఐమ్యాక్ 3 గిగాహెడ్జ్ 6 కోర్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెస‌ర్‌, రేడియాన్ ప్రొ 560ఎక్స్ 4జీబీ గ్రాఫిక్స్ కార్డ్‌, 8జీబీ ర్యామ్‌, 256 జీబీ ఎస్ఎస్‌డీ మోడ‌ల్ ధ‌ర – రూ.1,39,900

* 5కె రెటీనా ఐమ్యాక్ ప్రొ 3 గిగాహెడ్జ్ ఇంటెల్ జియాన్ డ‌బ్ల్యూ ప్రాసెస‌ర్‌, రేడియాన్ ప్రొ వెగా 56 8జీబీ గ్రాఫిక్స్ కార్డ్‌, 32జీబీ ర్యామ్, 1టీబీ ఎస్ఎస్‌డీ మోడ‌ల్ ధ‌ర – రూ.4,64,900

ఆపిల్ 27 ఇంచుల కొత్త ఐమ్యాక్ మోడ‌ల్స్‌తోపాటు అప్‌డేట్ చేయ‌బ‌డిన 21.5 ఇంచుల ఐమ్యాక్‌, ఐమ్యాక్ ప్రొ మోడ‌ల్స్‌ను ఈ నెల చివ‌రి నుంచి ఆపిల్ ఆథ‌రైజ్డ్ రీసెల్ల‌ర్లు విక్ర‌యిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news