ఆపిల్ సంస్థ ప్రతి ఏటా కొత్త ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను విడుదల చేసినట్లుగానే ఈ ఏడాది కూడా కొత్త ఐఓఎస్‌ను ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి తేనుంది. ఐఓఎస్ 13 పేరిట నూతన ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను సెప్టెంబర్ 19వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఆపిల్ తెలిపింది.
ఆపిల్ సంస్థ ప్రతి ఏటా కొత్త ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను విడుదల చేసినట్లుగానే ఈ ఏడాది కూడా కొత్త ఓఎస్‌ను ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి తేనుంది. ఐఓఎస్ 13 పేరిట నూతన ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను సెప్టెంబర్ 19వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఆపిల్ తెలిపింది. అదే రోజు ఐఫోన్ యూజర్లు సదరు కొత్త ఐఓఎస్‌ను తమ తమ ఐఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇక ఈ ఓఎస్‌లో ఉన్న టాప్ ఫీచర్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఐఓఎస్ 13లో కొత్తగా డార్క్ మోడ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. అలాగే ఇతర యాప్స్, వెబ్‌సైట్లలో లాగిన్ అయ్యేందుకు నూతన తరహా ఆపిల్ సైనిన్ విధానాన్ని అందిస్తున్నారు. దీంతోపాటు మ్యాప్స్ యాప్‌ను కొత్తగా తీర్చిదిద్దారు. ఇక కీ బోర్డుపై మరింత వేగంగా టైప్ చేసుకునేలా నూతన సదుపాయాలను అందిస్తున్నారు. ఐఓఎస్ 12 కన్నా ఐఓఎస్ 13ను మరింత వేగంగా పనిచేసేలా తీర్చిదిద్దారు. అలాగే అవాంఛిత కాల్స్‌ను ఆటోమేటిగ్గా మ్యూట్ చేసేలా నూతన ఫీచర్‌ను ఐఓఎస్ 13లో అందివ్వనున్నారు.
కాగా ఐఫోన్ 6ఎస్ ఆ తరువాత వచ్చిన ఐఫోన్లలో ఐఓఎస్ 13 ఇన్‌స్టాల్ అవుతుంది. ఆ తరువాత సెప్టెంబర్ 30వ తేదీన మరిన్ని ఫీచర్లతో ఐఓఎస్ 13.1ను విడుదల చేస్తారు. ఇక ఐప్యాడ్ ఎయిర్ 2 ఆ తరువాత డివైస్‌లు, అన్ని ఐప్యాడ్ ప్రొ మోడల్స్, ఐప్యాడ్ 5వ జనరేషన్ ఆ తరువాత డివైస్‌లు, ఐప్యాడ్ మినీ 4 ఆ తరువాత డివైస్‌లకు గాను ఆపిల్.. ఐప్యాడ్ ఓఎస్‌ను ప్రత్యేకంగా డెవలప్ చేసింది. ఈ క్రమంలో ఆ ఓఎస్‌ను సెప్టెంబర్ 30వ తేదీన విడుదల చేయనున్నారు. అదేవిధంగా సెప్టెంబర్ 19వ తేదీన వాచ్‌ఓఎస్ 6ను విడుదల చేస్తారు. వాచ్ సిరీస్ 3 ఆ తరువాత వచ్చిన ఆపిల్ వాచ్‌లకు ఈ అప్‌డేట్ లభిస్తుంది. ఇక సిరీస్ 1, 2 ఆపిల్ వాచ్‌లకు వాచ్‌ఓఎస్ 6ను ఈ ఏడాది చివర్లోగా అందిస్తారు.