చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే యాపిల్..!

-

రోజుకు ఒక యాపిల్ తినండి.ఇంకా డాక్టర్ తో పనిలేదు. ఇది మన అందరికీ తెలిసిన సామెత. అయితే మనలో చాలామంది యాపిల్ ని ఎప్పుడో ఒకసారి లేదా ఆరోగ్యం బాగా లేనప్పుడు మాత్రమే తింటూంటారు. ప్రతి రోజు ఒక యాపిల్ ని తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఇందులో విటమిన్ ఎ,బి, సి, ఇ, కె లతో పాటు థయామిన్,సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, ఫైబర్ ఇంకా అనేక పోషకాలు ఇందులో ఉన్నాయి.ఒక మనిషికి కావాల్సిన రోజువారి పోషకాలను యాపిల్ కలిగి ఉంది.

యాపిల్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.యాపిల్ లో ఉండే విటమిన్ ఈ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.యాపిల్ లో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలానే బరువును తగ్గించడంలో కూడా సహకరిస్తుంది.యాపిల్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఫ్రీ రాడికల్స్ తో పోరాడి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.అలాగే క్యాన్సర్ నుండి రక్షిస్తుంది.దంత సమస్యలను నివారించి దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టును కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేసి అధిక రక్తపోటును నివారిస్తుంది. బ్లడ్ లోని షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది.

యాపిల్ ల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ లాగా పని చేస్తుంది. యాపిల్ లో ఉండే బి కాంప్లెక్స్ విటమిన్స్ ఎర్ర రక్తకణాలని మరియు నాడీ వ్యవస్థ మెరుగుదలకి దోహదపడుతుంది.యాపిల్ లో కాల్షియం ఎక్కువ శాతం ఉంటుంది. ఇది మన ఎముకల ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ఎముకల నుంచి కాల్షియం ఎక్కువ మోతాదులో నష్టపోకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. మనం తినే ఆహారంలో సరైన మోతాదులో యాంటీ ఆక్సిడెంట్లు లేకపోవడం వల్ల ఆస్తమా లాంటి సమస్యలు వస్తున్నాయి. ప్రతిరోజు ఒక ఆపిల్ ని తీసుకోవడం వల్ల ఆస్తమా నుంచి ఉపశమనం పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version