తెలంగాణలో ఇప్పటికే స్థానికసంస్థలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. దీంతో ప్రజాప్రభుత్వం రాష్ట్రంలోని 128 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటి (సోమవారం) నుంచే రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి వచ్చింది.
మున్సిపాలిటీల్లో ఆదివారంతో పాలక వర్గాల పదవీకాలం ముగిసింది. ఇప్పట్లో లోకల్ బాడీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించే సమయం లేకపోవడంతో స్పెషల్ ఆఫీసర్ల ద్వారా పాలనను కొనసాగించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఆఫీసర్ల నియామకానికి సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన
మున్సిపాలిటీల్లో నిన్న ముగిసిన పాలక వర్గాల పదవీకాలం
128 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ pic.twitter.com/NOCTjiSDMy
— Telugu Scribe (@TeluguScribe) January 27, 2025