బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులు ఇచ్చామని.. రేషన్ కార్డులపై ఏనాడు ప్రచారం చేసుకోలేదని.. రేషన్ కార్డులు ఇవ్వడం చారిత్రాత్మకమా..? అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాజాగా తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. 2021 జులై 26నాడు భట్టి విక్రమార్క ఆయన నియోజకవర్గంలోనే ఫోటో దిగాడు. బీఆర్ఎస్ హయాంలో 6లక్షల 50వేల వరకు రేషన్ కార్డులు ఇచ్చామని గుర్తు చేశారు.
అయితే తాము ప్రభుత్వానికి ఖర్చు లేకుండా మీసేవా కేంద్రాల్లోనే ప్రజలు అప్లికేషన్లు చేసుకొని అక్కడే తీసుకునేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుల కోసం ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తుందన్నారు. తాము రేషన్ కార్డులు ఇవ్వలేదని.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు అంటుంటే నవ్వు వస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని చాలా మంది అపోహలు సృష్టిస్తున్నారు. తాము మీసేవా కేంద్రాల ద్వారా రేషన్ కార్డులు ఇచ్చినట్టు వెల్లడించారు కేటీఆర్.