కరోనా ఎఫెక్ట్ తో దేశం మొత్తం అల్లాడిపోతోంది. నిజానికి ఇప్పటికి నెల రోజులుగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్‌తో కరోనా అదుపులోకి వస్తుందని అందరూ భావించారు. కానీ, కానీ, గత నెల ఇదే రోజున ఉన్న కరోనా పాజి టివ్ కేసులకు, నెల రోజులు తిరిగే సరికి ఉన్న పాజిటివ్ కేసులకు మధ్య వందల రెట్ల వ్యత్యాసం కనిపిస్తోం ది. ప్రస్తుతం మరణాల సంఖ్య 600 లకు చేరువలో ఉంది. అదే సమయంలో పాజిటివ్ కేసుల సంఖ్య 15 వేల చేరువకు చేరింది. దీంతో మొత్తం పరిస్థితి దారుణాతి దారుణంగా మారిందనేది వాస్తవం.
దీనిని బట్టి కరోనాను కట్టడి చేసేందుకు ఉన్న ఏకైక అవకాశం లాక్‌డౌన్. ఇప్పటికే నెల రోజులుగా లాక్ డౌ న్ విధించిన ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రజలు హర్షించారు. నిర్బంధమే అయినప్పటికీ.. కరోనాను నిర్మూ లించే క్రమంలో ఇంటికే పరిమితమయ్యారు. అయితే, మరోపక్క, ఈ కరోనా కారణంగా విధించిన లాక్ డౌ న్‌తో ఆర్ధిక పరిస్థితి ఇబ్బందిగా పరిణమించింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనక తప్పడం లేదు. ఆర్ధిక వ్యవస్థ కుదేలైంది.
మొత్తంగా చూస్తే.. దేశంలో చిన్న చిన్న పనులు చేసుకుని పొట్ట పోసుకు నేవారికి ఆదరువు లేకుండా పోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం సోమవారం నుంచి లాక్‌డౌన్‌ను దేశవ్యాప్తంగా సడలించింది. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు ఎత్తేసింది. అయితే, పట్టణ ప్రాంతాల్లో మాత్రం కొంతమేరకు సడలించింది. మన దగ్గర కూడా కేవలం రెడ్ జోన్లు తప్ప మిగిలిన ప్రాంతాల్లో సడలించారు.
దీంతో ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన ప్రజలకు ఒకరకంగా రెక్కలు వచ్చినట్టే! అయితే, ప్రస్తుతం కరోనా కాలంలో ప్రజలు రెక్కలు కట్టుకుని బయటకు వస్తే.. ఇబ్బందులు తప్పవన్నది నిజం. లాక్‌డౌన్ పాటించనందుకే అమెరికా, ఇటలీలు తీవ్రంగా నష్టపోయాయి. సో.. లాక్‌డౌన్ అధికారికంగా తొలగించినా.. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే, ఖచ్చితంగా ఉంది.