ఏప్రిల్ 23న సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్..!

-

హిందువులు జరుపుకునే ముఖ్య పండుగలో హనుమాన్ జయంతి కూడా ఒకటి. అయితే ఈసారి హనుమాన్ జయంతి ఏప్రిల్ 23న వచ్చింది. హనుమాన్ జయంతి సందర్భంగా ఆ రోజు సెలవు ఇవ్వాలని తెలంగాణ విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విహెచ్పి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు నరసింహమూర్తి పండరీనాథ్ అలానే శివరాములు మీడియాతో మాట్లాడారు. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

వినాయక చవితి శ్రీరామనవమి పండుగలు అని హనుమాన్ జయంతి కూడా సెలవు దినంగా ప్రకటించాలని అన్నారు. ఈ సంవత్సరం కూడా వీర హనుమాన్ విజయ యాత్ర ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈనెల 23వ తేదీన గౌలిగూడ శ్రీ రామ మందిరం నుండి తాడ్బండ్ హనుమాన్ మందిర్ దాకా నిర్వహించనున్నట్లు చెప్పారు అయితే ఈ రోజు సెలవుదినంగా ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version