ప్ర‌యాణీకుల‌కు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్…!

ప్ర‌యాణీకుల‌కు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి క్రిస్మ‌స్ పండ‌గ‌ల నేప‌థ్యంలో దూర ప్రాంతాల‌కు వెళ్లే ప్ర‌యాణీకుల కోసం ఆర్టీసీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సీటు రిజ‌ర్వేషన్ చేసుకునే ప్ర‌యాణీకుల కోసం ముందస్తు రిజ‌ర్వేష‌న్ గ‌డువును పొడిగించింది. కాగా ప్ర‌స్తుతం కేవ‌లం 30 రోజుల ముందు మాత్ర‌మే ముందస్తు రిజ‌ర్వేష‌న్ ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ గ‌డువును ఇప్పుడు 60 రోజుల వ‌ర‌కూ పొడిగిస్తూ ఆర్టీసీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

చెన్నై, బెంగూళూరు కు వెళ్లే అన్ని బ‌స్సుల్లో ముందస్తు బుకుంగ్ అమ‌లు కానుంది. వ‌రుస‌గా ఉన్న పండ‌గ‌ల నేప‌థ్యంలోనే తాము ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. అన్ని జిల్లాల దూర ప్రాంతాల‌కు వెళ్లే బ‌స్సుల‌కు సైతం ఈ స‌దుపాయం అందుబాటులోకి రానుంది. ఇదిలా ఉండ‌గా క‌రోనాతో మ‌ర‌ణించిన ఉద్యోగుల కుటుంబ స‌భ్యుల‌ను జూనియ‌ర్ అసిస్టెంట్ లు గా నియ‌మించాల‌ని కూడా ఏపీ ఆర్టీసి నిర్న‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.