ఆర్టీసీ కాంప్లెక్స్ ను సందర్శించిన డీజీపీ, ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు.. ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందించారు. ఈ సాందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేసారు. ఏపీ ఆర్టీసీ ఉద్యోగులు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాబట్టి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు రూ.120 కోట్లను త్వరలోనే విడుదల చేస్తాం అని పేర్కొన్నారు. అదే విధంగా కార్గో సేవలలో దేశంలోనే ఏపీ ఆర్టీసీ మొదటి స్థానంలో ఉంది. కానీ, నేను ఊహించిన విధంగా ఆదాయం రావడం లేదు అని స్పష్టం చేసారు.
అందుకే ఆదాయం పెంచేందుకు సిబ్బంది ఇంకా కష్ట పడాలి. వచ్చే ఏడాది లోపు ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికే 950 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలోనే ఆర్టీసీ మనుగడ ఆధారపడి ఉంటుంది. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లాలన్నా ఏపీ ఆర్టీసీ బస్సులు ఎక్కేలా ప్రజలను ఆకట్టుకోవాలి అని ఎండీ ద్వారకాతిరుమలరావు పేర్కొన్నారు.