రాష్ట్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడుల కోసం అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడం కోసం దావోస్ వెళ్ళాము. నేను, మంత్రి శ్రీధర్ బాబు వెళ్ళాము అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే ప్రభుత్వం సాధించిన విజయాల్లో ఈ విజయం అత్యంత ముందుది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని కొందరు కుట్రలు పన్నుతున్నారు. ప్రపంచ దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. 2004 – 2014 వరకు అప్పుడు తీసుకున్న నిర్ణయాల మేరకు పెట్టుబడులు వచ్చాయి. నాడు ప్రధాని పీవీ సరళీకృత ఆర్థిక విధానాలు తీసుకు వచ్చారు.
ప్రపంచానికి ఒక బలమైన విశ్వాసాన్ని కాంగ్రెస్ నాయకత్వం చూపింది. రాజకీయ పరమైన విధానాలను విభేదించినా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపేక్షించాము. గత ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు తీసుకుంటే మరింత స్పష్టత తో ముందుకు వెళ్తున్నాం. పెట్టుబడి దారులకు వేగంగా భూములు.. అనుమతులు ఇస్తున్నాం. ఉద్యోగావకాశాలు పెంచాలని మా ఆకాంక్ష. అయితే దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. వారికి కావలసిన భూములు, ఇతర సౌకర్యాలు కల్పిస్తాము. తెలంగాణ భవిష్యత్ లో అత్యంత ఆదాయం కలిగిన రాష్ట్రంగా ఉండలి అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.