ఆరాంఘర్ ఫ్లై ఓవర్ తమ హయాంలోనే నిర్మించామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని ఆరాంఘర్– నెహ్రూ జూలాజికల్ పార్క్ వద్ద నిర్మించిన ఆరు లైన్ల ఫ్లై ఓవర్ను ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.
ఈ ఆరు లైన్ల ఫ్లై ఓవర్ను 4.048 కిలో మీటర్ల మేర నిర్మించారు. దీనికి రూ.799.74 కోట్ల వ్యయం అయినట్లు కేటీఆర్ వెల్లడించారు. గతంలో కేసీఆర్ ఎస్ ఆర్ డీపీ కింద రూ.42 కొత్త ప్రాజెక్టులను ప్రారంభించగా.. 36 విజయవంతం అయ్యాయని కేటీఆర్ తెలిపారు. పెండింగులో ఉన్న వాటిని ప్రస్తుత ప్రభుత్వం త్వరగా పూర్తి చేస్తుందని ఆశిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.