కేంద్ర కేబినెట్: అరవింద్-లక్ష్మణ్‌ల్లో ఛాయిస్ ఎవరు?

-

మరోసారి కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీల్లో ఎవరోకరికి ఛాన్స్ దొరుకుతుందనే ప్రచారం మొదలైంది. ఇప్పటికే తెలంగాణ నుంచి కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ నుంచి మరొకరికి ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నట్లు తెలిసింది. తెలంగాణపై కేంద్రం ఫుల్ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. నెక్స్ట్ ఎన్నికల్లో తెలంగాణలో గెలిచి అధికారంలోకి రావాలని చూస్తున్నారు.

దీంతో తెలంగాణ నుంచి మరొకరిని కేబినెట్ లోకి తీసుకుంటే..పార్టీకి మంచి పట్టు దొరుకుతుందని తెలుస్తోంది. అయితే ఉన్న ఎంపీల్లో ఎవరిని కేబినెట్ లోకి తీసుకుంటారనేది చర్చగా మారింది. ఎలాగో కిషన్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు. మిగిలిన ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు ఉన్నారు. అటు రాజ్యసభ ఎంపీగా కే.లక్ష్మణ్ ఉన్నారు. అయితే సంజయ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా ఉన్నారు. ఆయన దూకుడుగా పనిచేస్తున్నారు. ఆయన్ని కేబినెట్ లోకి తీసుకునే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆయనపై అదనపు బాధ్యతలు పెట్టే అవకాశాలు పెద్దగా లేవు.

ఇక ఛాన్స్ బాపురావు, అరవింద్, లక్ష్మణ్‌ ఉన్నారు…ఈ ముగ్గురులో ఒకరిని తీసుకోవచ్చు. సీనియర్ కోటాలో లక్ష్మణ్ ఉన్నారు. అయితే దూకుడుగా ఉండే అరవింద్‌కు మంత్రి పదవి ఇస్తే అడ్వాంటేజ్ అవుతుందనే ఆలోచన చేసే ఛాన్స్ కూడా ఉంది. మరి వీరిలో ఎవరిని కేబినెట్ లోకి తీసుకుంటారో చూడాలి. అటు ఏపీలో సీఎం రమేష్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. అలాగే యూపీ కోటలో రాజ్యసభ ఎంపీ అయిన జి‌వి‌ఎల్‌కు కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరి చూడాలి రెండు రాష్ట్రాలకు అవకాశం ఇస్తారో లేక తెలంగాణ నుంచే కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version