ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే, పార్టీ పటిష్టతపై దృష్టి సారించాడు సీఎం జగన్. ఇందులో భాగంగానే, వైసీపీ పార్టీలో కొంత మందికి కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు జగన్.
ఇక తాజాగా వైసీపీలో మొదట సారి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ క్రియేట్ చేశారు. అంతేకాదు, వైసీపీ పార్టీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణిని నియామకం చేశారు. ఈ మేరకు ప్రకటించింది పార్టీ కేంద్ర కార్యాలయం. అటు వైసీపీ పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం ప్రెసిడెంట్ గా ధనుంజయ్ రెడ్డి, బసిరెడ్డి సిద్ధార్ధ రెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రకటించింది పార్టీ కేంద్ర కార్యాలయం.